ఉక్రెయిన్ పిలుపుతో కదిలిన 3 వేల మంది అమెరికా వలంటీర్లు
- 11వ రోజుకు చేరుకున్న యుద్ధం
- అంతర్జాతీయ బెటాలియన్లో సేవలు అందించేందుకు ముందుకు రావాలని ఉక్రెయిన్ పిలుపు
- తాము రెడీ అంటూ వాషింగ్టన్లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించిన వలంటీర్లు
ఉక్రెయిన్ విజ్ఞప్తిపై స్పందించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లైజోన్గా ప్రకటించిన ఏ దేశమైనా తమతో సైనిక ఘర్షణలోకి వచ్చినట్టే భావిస్తామని హెచ్చరించారు. మరోవైపు, రష్యా దండయాత్రను అడ్డుకోవడంలో సాయపడే అంతర్జాతీయ బెటాలియన్లో సేవలు అందించేందుకు ముందుకు రావాలన్న ఉక్రెయిన్ పిలుపునకు 3 వేల మంది అమెరికన్లు స్పందించారు. అంతర్జాతీయ బెటాలియన్లో స్వచ్ఛందంగా సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారంతా తమను సంప్రదించినట్టు వాషింగ్టన్లోని ఉక్రెయిన్ ఎంబసీ ప్రతినిధి తెలిపారు.