Pavan Kalyan: 'భీమ్లా నాయక్' సీక్వెల్ పై రానా సమాధానం ఇదే!

Bheemla Nayak movie update
షార్ట్స్‌లో చూడండి
పవన్ కల్యాణ్ - రానా ప్రధానమైన పాత్రలను పోషించిన 'భీమ్లా నాయక్' క్రితం నెలలో థియేటర్లకు వచ్చింది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే .. సంభాషణలు సమకూర్చాడు. తమన్ బాణీలను అందించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను నమోదు చేసింది.

ఈ సినిమాలో 'డేనియల్ శేఖర్' పాత్రలో రానా నటించాడు. ఈ పవర్ఫుల్ పాత్రలో ఆయన పవన్ తో పోటీ పడుతూ మెప్పించాడు. ఈ సినిమా చూసిన వాళ్లంతా ఇంతకాలానికి రానాకి సరైన పాత్ర పడిందని చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందనే టాక్ మొదలైంది. తాజా ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న రానాకు ఎదురైంది.

అందుకు రానా స్పందిస్తూ . "ఈ సినిమా ఎక్కడ మొదలై ఎక్కడ ముగింపు తీసుకోవాలో అక్కడే ముగింపు పడింది. అందువలన సీక్వెల్ తీసే అవకాశం ఉండకపోవచ్చనేది నా అభిప్రాయం" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆయన తాజా చిత్రంగా 'విరాటపర్వం' విడుదలకి సిద్ధమవుతుండగా, 'రానా నాయుడు' వెబ్ సిరీస్ కూడా రెడీ అవుతోంది.
Go Back to Shorts
Pavan Kalyan
Rana Daggubati
Nithya Menen
Bheemla Nayak Movie

More Telugu News