ముంబైలో తెలుగు ప్రేక్షకుల మధ్య కూర్చొని ఈ సినిమా చూశాను: రానా

I watched Bheemla Nayak movie in Mumbai with Telugu audience says Rana
పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో వచ్చిన 'భీమ్లా నాయక్' ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో పవన్ పాత్రకు సమానంగా రానా పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉంది. రానాకు ఈ చిత్రంలో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఓ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఆత్మాభిమానానికి సంబంధించి ఒక చిన్న క్లాష్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇదని చెప్పాడు. 

ఈ సినిమా చేయడానికి ముందు రెండేళ్ల పాటు తాను అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నానని తెలిపారు. ఆరోగ్యం కుదురుకున్న తర్వాత తాను చేసిన తొలి చిత్రం ఇదేనని చెప్పాడు. ముంబైలో తెలుగు ప్రేక్షకుల మధ్యలో కూర్చొని తాను ఈ సినిమాను చూశానని... వారి నుంచి వస్తున్న స్పందనను చూసి చాలా సంతోషం వేసిందని అన్నాడు. 

ఈ చిత్రంలో తనకు, సంయుక్త మీనన్ కు మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారని చెప్పాడు. పెళ్లయిన వాడిని కావడం వల్లేమో సంయుక్తతో అంత బాగా నటించగలిగానని సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం వెంకటేశ్ బాబాయ్ తో కలిసి 'రానా నాయుడు' పేరిట వెబ్ సిరీస్ చేస్తున్నామని... అది పూర్తయిన తర్వాత మరో ప్రాజెక్టుపై దృష్టి సారిస్తానని చెప్పాడు.
Go Back to Shorts
Rana Daggubati
Pawan Kalyan
Bheemla Nayak

More Telugu News