అమూల్ పాల ధర పెంపు.. రేపటి నుంచే అమల్లోకి
- ప్రస్తుతం అమూల్ గోల్డ్ అర లీటర్ ధర రూ.28
- దానిని రూ.30కి పెంచుతూ నిర్ణయం
- తన బ్రాండ్‌కు చెందిన అన్ని ఉత్పత్తుల ధరలు పెంచుతున్నట్లు వెల్లడి
- మార్చి 1 నుంచే పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటన
ప్రస్తుతం అమూల్ గోల్డ్ పాలు అర లీటర్ ధర రూ.28గా ఉంది. దీనిని ఒకేసారి రూ.30కి పెంచుతున్నట్లు అమూల్ ప్రకటించింది. అర లీటర్ ధర రూ.2 పెరిగితే.. లీటర్ పాల ధర రూ.4 పెరిగినట్టే కదా. పెరిగిన ధరలు మార్చి 1 (మంగళవారం) నుంచే అమల్లోకి రానున్నట్లుగా అమూల్ తెలిపింది. పాల ధరలతో పాటు తన బ్రాండ్‌కు చెందిన అన్ని ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయని, పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని కూడా అమూల్ ప్రకటించింది.