వివేకా హత్య జగన్‌కు తెలిసే జరిగింది: నారా లోకేశ్
- సీబీఐ విచారణలో వెలుగులోకి నిజాలు
- సూత్రధారి అవినాశేనని సాక్షుల వాంగ్మూలాలు
- చంద్రబాబుపై నింద వేసిన జగన్ సీబీఐ విచారణ కూడా కోరలేదు
- వైఎస్ వివేకా హత్యపై నారా లోకేశ్ వ్యాఖ్యలు
వైఎస్ వివేకాను హత్య చేయించిందెవరన్న విషయం సీబీఐకి సునీతారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఉందని లోకేశ్ తెలిపారు. ఈ హత్యలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డే సూత్రధాని అని సాక్షులు తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నారని కూడా ఆయన చెప్పారు. వివేకా హత్య కేసులో సూత్రధారులు ధర్జాగా రోడ్లపై తిరుగుతోంటే.. ప్రజల కోసం పోరాడుతున్న టీడీపీ నేతలపై జగన్ సర్కారు అక్రమ కేసులు బనాయిస్తోందని ఆయన ఆరోపించారు. జగన్ విపక్ష నేతగా ఉన్న సమయంలో జరిగిన వివేకా హత్య కేసుపై నాడు సీఎంగా ఉన్న చంద్రబాబుపై నిరాధార ఆరోపణలు చేసిన జగన్.. తాను సీఎం అయిన తర్వాత కనీసం సీబీఐ దర్యాప్తును కూడా కోరలేదని లోకేశ్ అన్నారు.