భీమ్లానాయక్ సినిమా టికెట్లు అధిక ధరకు విక్రయం.. గుడివాడ థియేటర్‌కు జరిమానా

Gudivada Bhaskar Theatre fined by authorities
  • గుడివాడలోని జీ3 భాస్కర్ థియేటర్‌లో టికెట్ల ధర పెంపు
  • టికెట్లపై ధర ముద్రించని వైనం
  • ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు అందడంతో విచారణ 
  • రూ. 50 వేల జరిమానా విధించిన వైనం
పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా టికెట్లను అధిక ధరకు విక్రయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణా జిల్లా గుడివాడలోని ఓ థియేటర్‌పై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. స్థానిక జీ3 భాస్కర్ థియేటర్‌లో భీమ్లానాయక్ సినిమా టికెట్లను అధిక ధరకు విక్రయిస్తున్నట్టు ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు అందడంతో గుడివాడ ఆర్ఐ జాస్తి అరవింద్ థియేటర్‌లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాధవీలతకు నివేదికను పంపారు.

డైమండ్ కేటగిరీ టికెట్ ధర రూ. 70 అయితే దానిని రూ. 100కు విక్రయిస్తున్నారని, అలాగే, పలు టికెట్లపై ధరలను ముద్రించలేదని ఆర్ఐ తెలిపారు. ఆర్ఐ అరవింద్ పంపిన నివేదికను పరిశీలించిన జేసీ మాధవీలత థియేటర్ యాజమాన్యానికి రూ. 50 వేల జరిమానా విధించారు. ఈ థియేటర్‌ను మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని శుక్రవారమే ప్రారంభించడం గమనార్హం.
Go Back to Shorts
Bheemla Nayak
Gudivada
Bhaskar Theatre
Pawan Kalyan

More Telugu News