ఉక్రెయిన్ నుంచి 219 మంది భారతీయులతో బయలుదేరిన తొలి విమానం
- రొమేనియా సరిహద్దుకు చేరుకున్న వారితో ముంబైకి విమానం
- భారతీయులందరినీ సురక్షితంగా తీసుకొస్తామని తెలిపిన విదేశాంగ మంత్రి జైశంకర్
- ఈ ప్రక్రియను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నానని వెల్లడి
భారత విదేశాంగ శాఖ సూచనలను అనుసరిస్తూ రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మంది భారతీయులను ఆ విమానం ద్వారా ముంబైకి పంపారు. ఈ విషయాన్ని తెలిపిన జైశంకర్.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు అందరినీ సురక్షితంగా దేశానికి తీసుకువచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నానని కూడా ఆయన తెలిపారు. భారతీయుల తరలింపులో మెరుగైన సహకారం అందిస్తున్న రొమేనియా విదేశాంగ మంత్రి బోగ్డాన్ అరెస్కూకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.