మాడి మసైపోయిన రష్యా సైనికులు.. ఉక్రెయిన్ రక్షణ శాఖ విడుదల చేసిన వీడియో ఇదిగో
- ఇర్పెన్–బూకా మధ్య ఉక్రెయిన్ సైనికుల ప్రతిదాడి
- పదుల సంఖ్యలో రష్యా సైనికుల మృతి
- మా దేశంలోకి వస్తే చావేనంటూ కామెంట్
నిన్న గోస్టోమెల్ కు సమీపంలోని ఇర్పెన్, బూకా మధ్యలోని ఇంటర్ సెక్షన్ లోకి వచ్చిన రష్యా సైనికులను ఉక్రెయిన్ సోల్జర్లు నిలువరించారని ఉక్రెయిన్ రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నాజీ ఆక్రమణదారులను గోస్టోమెల్ దగ్గర ఉక్రెయిన్ సైనికులు కాల్చేశారని చెప్పారు. ‘‘వాళ్లు కాలిపోతున్నారు. చచ్చిపోతున్నారు. లొంగిపోతున్నారు. ఉక్రెయిన్ జిందాబాద్’’ అంటూ ల్యాండ్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. కాగా, ఉక్రెయిన్ ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా 2,500 మందిదాకా రష్యా సైనికులు చనిపోయినట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు.