rape and murder: మాదాపూర్‌లో దారుణం.. ప్రేయ‌సిపై ప్రియుడి హ‌త్యాచారం

The young man who raped his girlfriend and then murdered her
  • బాధితురాలిని ప్రేమించిన లాలూ ప్ర‌సాద్‌
  • మ‌రో యువ‌కుడితో తిరుగుతోంద‌ని బాధితురాలిపై క‌క్ష‌
  • హైటెక్ సిటీ వ‌ద్ద‌కు పిలిచి ఆమెపై అత్యాచారం, ఆపై హ‌త్య‌
  • పోలీసుల ఎదుట నేరం ఒప్పుకున్న లాలూ ప్ర‌సాద్‌
హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌లో బుధ‌వారం దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువ‌తిపైనే ప్రియుడు అత్యాచారానికి పాల్ప‌డి ఆపై ఆమెను హ‌త్య చేశాడు. త‌న‌ను ప్రేమించిన యువ‌తి.. వేరే యువ‌కుడితో స‌న్నిహితంగా తిరుగుతోంద‌న్న కార‌ణంగా ప్రియుడు ఆమెపై ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. అయితే ఘ‌ట‌న వెలుగు చూసిన వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

హైటెక్ సిటీ ఔట్ పోస్ట్ వ‌ద్ద చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే.. లాలూ ప్ర‌సాద్ అనే యువ‌కుడు బాధిత యువ‌తిని ప్రేమించాడు‌. అయితే ఇటీవ‌ల స‌ద‌రు యువ‌తి న‌రేష్ అనే యువ‌కుడితో తిరుగుతోంద‌ట‌. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన లాలూ ప్ర‌సాద్‌.. త‌న‌ను ప్రేమించి న‌రేష్‌తో ఎలా తిరుగుతుంద‌ని బాధితురాలిపై క‌క్ష పెంచుకున్నాడు.

ఈ క్ర‌మంలో ఆమెను అంత‌మొందించాల‌ని ప‌థ‌కం వేసుకున్న లాలూ ప్ర‌సాద్‌.. యువ‌తిని హైటెక్ సిటీ ఔట్ పోస్టు వ‌ద్ద‌కు పిలిచి ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అనంతరం ఆమెను హ‌త్య చేశాడు. ఇదే విష‌యాన్ని అత‌డు పోలీసుల వ‌ద్ద కూడా ఒప్పుకున్నాడు.
rape and murder
madhapur
hightech city outpost

More Telugu News