Nani: 'అంటే .. సుందరానికీ' రిలీజ్ డేట్ ఖరారు!

  • నాని తాజా చిత్రంగా 'అంటే సుందరానికీ'
  • కథానాయికగా నజ్రియా పరిచయం
  • కీలకమైన పాత్రలో నదియా
  • జూన్ 10వ తేదీన విడుదల
Ante Sundaraniki movie update

నాని హీరోగా 'అంటే సుందరానికీ' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. రేపు నాని పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బర్త్ డే బ్లాస్ట్ పేరుతో ఒక వీడియోను వదిలారు. నాని పాత్ర స్వరూప స్వభావాలతో పాటు కథ ఏ అంశం చుట్టూ తిరుగుతుందనేది చెప్పేశారు.

సుందరానికి చిన్నప్పటి నుంచి గండాలు ఉన్నాయనే భయంతో అతనితో ఎప్పుడూ ఏదో ఒక హోమం చేయిస్తూ ఉంటారు. అతనేమో ఇక హోమాలు చేయడం తన వల్ల కాదని విసుక్కుంటూ ఉంటాడు. ఈ వీడియో ద్వారా ఈ సినిమా టీమ్ నానీకి శుభాకాంక్షలు తెలియజేసింది. అంతేకాదు, ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేయనున్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు.

వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాతో కథానాయికగా నజ్రియా నజీమ్ తెలుగు తెరకి పరిచయమవుతోంది.  నరేశ్ .. రోహిణి .. నదియా .. సుహాస్ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా నాని 'దసరా'ను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.

More Telugu News