Talasani: భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు ప్రత్యేక అతిథిగా మంత్రి తలసాని

Talasani will attend Bheemla Nayak pre release event as special guest
షార్ట్స్‌లో చూడండి
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్టుగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా విచ్చేస్తున్నారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మంత్రి తలసాని ప్రత్యేక అతిథిగా వస్తున్నారని చిత్రబృందం వెల్లడించింది. చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టయిన్ మెంట్స్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.

పవన్, రానా, నిత్యా మీనన్, సంయుక్త నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు రాశారు. తమన్ స్వరపరిచిన గీతాలు అత్యంత ప్రజాదరణ పొందాయి.
Go Back to Shorts
Talasani
Special Guest
Bheemla Nayak
Pre Release Event
Pawan Kalyan
Rana Daggubati
Sagar K Chandra
Tollywood

More Telugu News