శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వానం
- మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు
- ఈ నెల 22 నుంచి మార్చి 4 వరకు ఉత్సవాలు
- సీఎం జగన్ ను ఆహ్వానించిన మంత్రి వెల్లంపల్లి, ఆలయ ఈవో
- సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేత
మంత్రి వెల్లంపల్లి, ఆలయ ఈవో లవన్న నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం జగన్ కు వేదాశీర్వచనం అందించారు. ఆలయ వర్గాలు సీఎం జగన్ కు జ్ఞాపికను కూడా బహూకరించాయి.