శ్రీవారి ఆర్జిత సేవల ధరలు పెంచనున్న టీటీడీ... ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం
- టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- తిరుమల అన్నమయ్య భవన్ లో భేటీ
- ఆర్జిత సేవలు రెండేళ్ల కిందట నిలిపివేశారన్న వైవీ
- మళ్లీ ప్రారంభిస్తున్నట్టు వెల్లడి
టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ, ఇప్పటివరకు ఉన్న ఆర్జిత సేవల ధరలు పాతికేళ్ల కిందట నిర్ణయించినవని వెల్లడించారు. కాగా, నేటి సమావేశంలో సుప్రభాతం, తోమాల, అర్చన, కల్యాణోత్సవ టికెట్ల ధరల పెంపుపై చర్చ జరిగింది. సేవా టికెట్ల ధర పెంపుపై ధర్మకర్తల మండలి ఇంకా నిర్ణయం తీసుకోలేదు.