మరోసారి 'పోకిరి'ని గుర్తుచేయనున్న మహేశ్ బాబు!

Sarkaru Vaari Paata movie update
  • విభిన్నమైన కథా చిత్రంగా 'సర్కారువారి పాట'
  • మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్
  • కళావతి పాటకి రికార్డు స్థాయి వ్యూస్
  • మే 12వ తేదీన విడుదల  
మహేశ్ బాబు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'పోకిరి' ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనాన్ని సృష్టించింది. ఆ తరువాత మహేశ్ బాబు ఎన్ని సినిమాలు చేసినా, 'పోకిరి' సినిమాకి గల ప్రత్యేకమైన స్థానం అలాగే ఉంది. ఏ సినిమాను కూడా మహేశ్ ఆ సినిమాతో పోలుస్తూ మాట్లాడలేదు.

కానీ 'సర్కారువారి పాట' సినిమా మాత్రం 'పోకిరి'లా ఉంటుందని మహేశ్ చెప్పాడు. ఆ మధ్య తన అభిమానులతో సమావేశమైనప్పుడు కూడా మహేశ్ ఇదే మాట చెప్పాడు. ఇక ఇప్పుడు పాటల రచయిత అనంత శ్రీరామ్ కూడా అదే మాట చెప్పాడు. ఈ సినిమా కోసం ఆయన నాలుగు పాటలు రాయగా, కళావతి పాట అనూహ్యమైన స్థాయిలో వ్యూస్ ను రాబడుతోంది.  

ఈ కథలో మహేశ్ బాబు సమాజం గురించి గానీ .. అమ్మాయిల ప్రేమ గురించి గాని పెద్దగా పట్టించుకోడు. 'పోకిరి' సినిమా తరహాలో ఆయన పాత్ర ఉంటుంది. అలాంటి ఆయనకి కళావతి కనిపించగానే మనసులో ఏదో అలజడి మొదలవుతుంది. ఆమె ఇచ్చిన మొదటి హగ్ ఆయనను మార్చేస్తుంది" అని చెప్పుకొచ్చాడు. మే 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
Go Back to Shorts
Mahesh Babu
Keerthy Suresh
Parashuram
Sarkaru Vaari Paata

More Telugu News