ఏపీలో కొత్తగా 615 కరోనా కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!
- గత 24 గంటల్లో 22,267 కరోనా పరీక్షలు
- పశ్చిమ గోదావరి జిల్లాలో 134 కొత్త కేసులు
- రాష్ట్రంలో నలుగురి మృతి
- ఇంకా 12,550 మందికి చికిత్స
అదే సమయంలో 2,787 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,13,827 మంది కరోనా బారినపడగా, వారిలో 22,86,575 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 12,550 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,702కి పెరిగింది.