నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు భారత సంతతి అమ్మాయితో ఆస్ట్రేలియా క్రికెటర్ పెళ్లి
- మ్యాక్స్ వెల్ వెడ్స్ వినీ రామన్
- తమిళంలో పెళ్లి కార్డు ముద్రణ
- మార్చి 27న హిందూ వివాహం
- 2020లోనే నిశ్చితార్థం
మ్యాక్స్ వెల్, వినీ శ్చితార్థం 2020లోనే జరిగినా, పెళ్లి కోసం ఇన్నాళ్లు ఆగారు. వీరు మార్చి 27న పెళ్లి చేసుకోబోతున్నారు. విశేషం ఏంటంటే, మ్యాక్స్ వెల్ క్రిస్టియన్ అయినప్పటికీ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై గౌరవంతో హిందూ వివాహం చేసుకుంటున్నాడు. కాగా, వినీ రామన్ తమిళ అమ్మాయి కావడంతో, పెళ్లి కార్డును తమిళంలోనే ప్రింట్ చేయించారు. సోషల్ మీడియాలో వీరి పెళ్లి కార్డు వైరల్ అవుతోంది.
