అమెరికాలో కాల్పులు... తెలుగు యువకుడి విషాదాంతం

Telugu youth died in Alabama shooting
  • అలబామాలో కాల్పులు
  • విశాఖ వాసి చిట్టూరి సత్యకృష్ణ మృతి
  • ఇటీవలే అమెరికా వెళ్లిన సత్యకృష్ణ
  • సత్యకృష్ణ కుటుంబంలో విషాదం
తుపాకీ సంస్కృతికి ఆలవాలమైన అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఏపీకి చెందిన ఓ యువకుడు ఈ కాల్పుల్లో మృతి చెందడం విషాదకరం. ఆ యువకుడిని విశాఖకు చెందిన చిట్టూరి సత్యకృష్ణగా గుర్తించారు. ఇటీవలే పై చదువుల కోసం అమెరికా వెళ్లిన సత్యకృష్ణ ఓల్డ్ బర్మింగ్ హామ్ లో పార్ట్ టైమ్ ఉద్యోగంలో చేరాడు. ఓ స్టోర్ లో పనిచేస్తున్నాడు. అలబామాలో జరిగిన కాల్పుల ఘటనలో 27 ఏళ్ల సత్యకృష్ణ మృత్యువాతపడ్డాడు. సత్యకృష్ణ మృతితో విశాఖలోని అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Go Back to Shorts
Chitturi Sathyakrishna
Death
Shooting
Alabama
USA

More Telugu News