Prabhas: పునీత్ రాజ్ కుమార్ ను ఉద్దేశించి భావోద్వేగ ట్వీట్ చేసిన ప్రభాస్

Prabhas emotional post on Puneet Rajkumar
షార్ట్స్‌లో చూడండి
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్' విడుదల కాబోతోంది. మార్చ్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్ ను నిన్న విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పునీత్ ను తలచుకుంటూ ప్రభాస్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

''జేమ్స్' రూపంలో మనం అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నాం. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సర్ ని అభిమానించే లక్షలాది మందికి ఈ చిత్రం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. వీ మిస్ యూ సర్' అని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. మరోవైపు ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' చిత్రం మార్చి 11న విడుదల కానుంది.
Go Back to Shorts
Prabhas
Tollywood
Puneet Rajkumar

More Telugu News