తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Media Bulletin on status of positive cases
  • గత 24 గంటల్లో 767 కేసుల నమోదు
  • కరోనా కారణంగా ఇద్దరి మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17,754
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 228 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 2,861 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 97.20 శాతంగా ఉంది. రాష్ట్రంలో 17,754 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,81,603గా ఉంది. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 4,105కి చేరుకుంది. ఇప్పటి వరకు 7,59,744 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  

Go Back to Shorts
Telangana
Corona Virus
Updates

More Telugu News