అచ్చంపేటలో తీవ్ర ఉద్రిక్తత.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ
- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు
- అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు
- కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య రాళ్లు, కర్రలతో దాడి
దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. కొందరు కాంగ్రెస్ కార్యర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని వ్యానులో తీసుకెళ్లారు. టీఆర్ఎస్ కార్యకర్తలను వదిలేసి తమ కార్యకర్తలను తీసుకెళ్లారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.