అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... 8 మంది దుర్మరణం

Eight people died in fatal accident in Ananthapur district
  • ఉరవకొండ మండలంలో ఘటన
  • కారును ఢీకొన్న లారీ
  • నుజ్జునుజ్జయిన కారు
  • మృతులు నిమ్మగల్లు గ్రామానికి చెందినవారు
అనంతపురం జిల్లాలో రహదారి నెత్తురోడింది. ఉరవకొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. బుదగవి వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. బళ్లారిలో పెళ్లికి వెళ్లిన ఓ బృందం కారులో అనంతపురానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. మృతులు ఉరవకొండ మండలంలో నిమ్మగల్లు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో సంఘటన స్థలం శోకసంద్రంలా మారింది.
Go Back to Shorts
Road Accident
Uravakonda
Car
Lorry
Anantapur District

More Telugu News