ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా రోజువారీ కేసులు... తాజా వివరాలు ఇవిగో!

AP Corona updates
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో 30,886 కరోనా పరీక్షలు నిర్వహించగా... 4,198 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 555 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 528, గుంటూరు జిల్లాలో 485, కర్నూలు జిల్లాలో 459, పశ్చిమ గోదావరి జిల్లాలో 446 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 9,317 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,97,369 మంది కరోనా బారినపడగా, వారిలో 21,94,359 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 88,364 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,646కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Bulletin
Today Cases

More Telugu News