Vaishnav Tej: 'రంగ రంగ వైభవంగా' ఫస్టు సింగిల్ రిలీజ్!

Ranga Ranga Vaibhavanga first single released
షార్ట్స్‌లో చూడండి
'ఉప్పెన' సినిమాతో యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న వైష్ణవ్ తేజ్ మూడో సినిమాగా 'రంగరంగ వైభవంగా' రూపొందుతోంది. గిరీశాయ దర్శకత్వంలో బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా కేతిక శర్మ కనిపించనుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ను కలుపుకుంటూ సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది.

దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు. 'తెలుసా తెలుసా ఎవరికోసం ఎవరు పుడతారో .. ఎవరికి ఎవరేమి అవుతారో' అంటూ ఈ పాట సాగుతోంది. శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను శంకర్ మహదేవన్ ఆలపించారు.

ఈ సాంగ్ ను బట్టి హీరో హీరోయిన్ల మధ్య హై స్కూల్ రోజుల నుంచే లవ్ మొదలవుతుందనే విషయం అర్థమవుతోంది. మెడికల్ కాలేజ్ లో స్టూడెంట్స్ గా ఉన్నప్పటికీ వాళ్ల మధ్య అదే ప్రేమ కొనసాగుతున్నట్టుగా చూపించారు. విజయ్ బిన్ని కొరియోగ్రఫీని అందించాడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Go Back to Shorts
Vaishnav Tej
Kethika Sharma
Ranga Ranga Vaibhavanga Movie

More Telugu News