ఇక్కడ మంచు నల్లగా కురుస్తుంది!
- రష్యాలో ఆశ్చర్యకర పరిణామం
- ఓంసుచన్ పట్టణంలో నల్లమంచు
- థర్మల్ వేడినీళ్ల ప్లాంటే కారణం
- ఇది బొగ్గు ఆధారిత ప్లాంట్
- భారీ ఎత్తున కాలుష్యం
ఓంసుచన్ పట్టణంలో థర్మల్ ఆధారిత వేడి నీళ్ల ప్లాంట్ ఉంది. సైబీరియా ప్రాంతంలో గడ్డకట్టించే చలి ఉంటుంది. అందుకే ఈ ప్లాంట్ ద్వారా 4 వేల మందికి వేడి నీరు సరఫరా చేస్తారు. దీనికి బొగ్గు ఇంధనంగా వాడతారు. దాంతో ఈ ప్రాంతంలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంటుంది. ప్లాంట్ నుంచి వెలువడే మసి మంచును సైతం నల్లగా మార్చేస్తోంది. ఇక్కడ కురిసే మంచు కొన్ని అడుగుల మేర పేరుకుపోతుంది. ఈ నల్ల మంచుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి.