తెలంగాణలో కొత్తగా 3,801 కరోనా కేసులు

Media Bulletin on status of positive cases in Telangana
  • గత 24 గంటల్లో 3,801 కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న 2,046 మంది
  • యాక్టివ్ కేసుల సంఖ్య 38,023
తెలంగాణలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 3,801 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 2,046 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకరు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,570 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 38,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.37 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 88,867 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.


Go Back to Shorts
Telangana
Corona Virus

More Telugu News