'సర్కారువారి పాట' ఫస్టు సింగిల్ రిలీజ్ కి తేదీ ఖరారు!

Sarkaru Vaari Paata movie update
  • మహేశ్ తాజా చిత్రంగా 'సర్కారువారి పాట'
  • కథానాయికగా కీర్తి సురేశ్
  • సంగీత దర్శకుడిగా తమన్
  • ఫిబ్రవరి 14న ఫస్టు సింగిల్
మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. త్వరలోనే మిగతా షూటింగుకు సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది.

ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ సంక్రాంతికి వస్తుందని అంతా ఎదురుచూశారు. కానీ కొన్ని కారణాల వలన ఫస్టు సింగిల్ ను వదలలేకపోయారు. ఇక ఇప్పుడు ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు.

తమన్ పై ఈ పోస్టర్ ను రిలీజ్ చేయడం విశేషం. తనకి సంబంధించిన సినిమా ప్రమోషన్స్ విషయంలో తమన్ ఎంత చురుకుగా ఉంటాడనేది తెలిసిందే. ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఆ తేదీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది..
Go Back to Shorts
Mahesh Babu
Keerthy Suresh
Parashuram
Sarkaruvari pata Movie

More Telugu News