ఆలిండియా సర్వీసెస్ రూల్స్ సవరణను నిరసిస్తూ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
- ఆలిండియా సర్వీస్ రూల్స్ సవరణ
- రాష్ట్రాలతో పనిలేకుండా అధికారులకు డిప్యుటేషన్
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీయేతర ముఖ్యమంత్రులు
- తన బాణీ వినిపించిన కేసీఆర్
ఈ సవరణతో ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ స్వరూపమే మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం అని, దీన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్ తన లేఖలో డిమాండ్ చేశారు. తాజా సవరణతో, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండానే ఆలిండియా సర్వీస్ అధికారులను డిప్యుటేషన్ పై తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుంది. దీనిపై దేశంలోని బీజేపీయేతర సీఎంలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.