ఫైల్స్ తేలేదని ఆగ్రహం.. డిప్యూటీ కలెక్టర్, అధికారిని సమీక్ష హాలులోనే కొట్టిన కేంద్రమంత్రి!
- ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఘటన
- తన నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై సహాయమంత్రి బిశ్వేశ్వర్ సమీక్ష
- సంబంధిత ఫైల్స్ తీసుకురాకపోవడంతో ఆగ్రహం
- కుర్చీతో దాడి
- ఖండించిన కేంద్రమంత్రి
ఈ సమావేశానికి అధికారులు ఫైల్స్ తీసుకురాకుండా ఉత్తచేతులతో రావడం మంత్రికి ఆగ్రహం తెప్పించింది. డిప్యూటీ కలెక్టర్ అశ్వినీ కుమార్, జిల్లా ప్రణాళిక, పర్యవేక్షణ యూనిట్ డైరెక్టర్ దేబాశీష్ మహాపాత్రపై మండిపడిన మంత్రి సమీక్ష నిర్వహిస్తున్న గది తలుపులు మూసేసి తమపై భౌతిక దాడికి దిగారని ఆరోపించారు.
ఈ దాడిలో తన చేయి విరిగిపోయిందని మహాపాత్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయని డిప్యూటీ కలెక్టర్ తెలిపారు. వారి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, దాడి వార్తలను మంత్రి బిశ్వేశ్వర్ ఖండించారు.