ఐదు రాష్ట్రాల ఎన్నికలు: ర్యాలీలు, రోడ్ షోలపై ఈ నెల 31 వరకు నిషేధం పొడిగింపు
- ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు
- ఏడు దశల్లో పోలింగ్
- ఈ నెల 31 వరకు ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం
- మొదటి, రెండో దశ ఎన్నికలు జరిగే ప్రాంతాలకు సడలింపు
అయితే, తొలిదశలో ఎన్నికలు జరుపుకునే ప్రాంతాల్లో ఈ నెల 28 తర్వాత ఆయా ప్రాంతాల్లో బహిరంగ సభలకు అనుమతి ఇచ్చింది. రెండో దశ ఎన్నికలు జరుపుకునే ప్రాంతాల్లో ఫిబ్రవరి 1 నుంచి సభలు నిర్వహించుకోవచ్చని ఈసీ తెలిపింది. ఇంటింటి ప్రచారానికి ఇప్పటివరకు గరిష్ఠంగా ఐదుగురికి మాత్రమే అనుమతి ఉండగా, ఇప్పుడా సంఖ్యను 10కి పెంచింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వీడియో ప్రచార రథాలను రంగంలోకి దింపుకోవచ్చని పేర్కొంది.