ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రచారం?
- బీజేపీపై గుర్రుగా ఉన్న కేసీఆర్
- మంత్రి మండలి సమావేశంలో యూపీ ఎన్నికల ప్రచారంపై చర్చ
- పార్టీ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, రాష్ట్రాల హక్కులను అది కాలరాస్తోందని విమర్శించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని కూడా కేసీఆర్ పేర్కొన్నట్టు చెబుతున్నారు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడంపై కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలోనే ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే పార్టీ సమావేశం ఏర్పాటు చేసి ప్రచారం విషయమై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.