తాలిబన్ల పైశాచికత్వం.... సంగీతకారుడి ఎదుటే వాయిద్య పరికరం దగ్ధం చేసిన వైనం

16-01-2022 Sun 17:19
  • ఆఫ్ఘన్ లో మరో అరాచక ఘటన
  • పక్తికా ప్రావిన్స్ లో ఓ సంగీతకారుడికి చేదు అనుభవం
  • వీడియో పంచుకున్న ఆఫ్ఘన్ జర్నలిస్ట్
Taliban set to fire music instrument in front of musician
తాలిబన్ల అరాచకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి ఉన్మాదాన్ని వెల్లడించే తాజా వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. పక్తికా ప్రావిన్స్ లోని జజాయ్ అరుబ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ సంగీతకారుడి కళ్లెదుటే అతడి వాయిద్య పరికరాన్ని తాలిబన్లు దగ్ధం చేశారు.

ఈ వీడియోను అబ్దుల్ హక్ ఒమేరీ అనే ఆఫ్ఘన్ జర్నలిస్టు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వాయిద్య పరికరం అగ్నికి ఆహుతవుతుండగా, విలపిస్తున్న ఆ సంగీతకారుడి వైపు చూస్తూ తాలిబన్లు వెకిలిగా నవ్వుతుండడం ఆ వీడియోలో కనిపించింది.