రష్యా ఎస్ 400 క్షిపణుల కొనుగోలు వ్యవహారం .. భారత్ మీద ఆంక్షలపై అమెరికా స్పందన!
- ఆంక్షల విధాన కో ఆర్డినేటర్ స్పందన
- మిత్రుల మీద ఆంక్షలు ఎలా పెడతామనుకుంటున్నారు?
- టర్కీకి, భారత్ కు తేడా ఉందని కామెంట్
భారత్ తో ఉన్న భౌగోళిక రాజకీయ బంధాలు, పరిస్థితుల దృష్ట్యా దానిపై మరింత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ప్రత్యేకించి చైనాను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని అన్నారు. ‘‘టర్కీ, భారత్.. రెండు వేర్వేరు పరిస్థితులు. రెండు భిన్న ధ్రువాలు. వాటివి వేర్వేరు రక్షణ భాగస్వామ్యాలు. శత్రువులపై విధించినట్టుగానే మిత్రులపైనా ఆంక్షలను ఎలా విధిస్తామని అనుకుంటున్నారు?’’ అని అన్నారు. ఆ రెండు దేశాలకు పోలికే లేదని, టర్కీ ప్రస్తావన అప్రస్తుతమని అన్నారు.