Chandrababu: పిన్నెల్లి రామకృష్ణారెడ్డీ... నీలాంటి వాళ్లను చాలామందిని చూశాం: చంద్రబాబు

Chandrababu fires on YCP MLA Pinnelli Ramakrishna Reddy
షార్ట్స్‌లో చూడండి
గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య అంత్యక్రియలకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. మనందరి ప్రాణాలు ఒకటేనని తెలుసుకోవాలని అన్నారు.

"మీరో పార్టీకి, మేమో పార్టీకి పనిచేస్తున్నాం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయం తెలుసుకోవాలి. చంద్రయ్యను నడిరోడ్డుపై కిరాతకంగా హత్య చేశారు" అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. "రౌడీలు అందరూ జాగ్రత్తగా ఉండాలి... ఖబడ్దార్!" అంటూ హెచ్చరించారు. ఒక్క చంద్రయ్యను చంపితే వందమంది తయారవుతారని స్పష్టం చేశారు. పల్నాడులోని ముఠాలను అణచివేసింది తానేనని, కానీ ఇప్పుడు చంద్రయ్య హత్యపై సీఎం జగన్ జవాబు చెప్పాలని ప్రశ్నించారు.

"పిన్నెల్లి రామకృష్ణారెడ్డీ... నీలాంటి వాళ్లను చాలామందిని చూశాం. మాచర్ల మీ జాగీరు అనుకుంటున్నారేమో... ఖబడ్దార్! మా నేతలపై దాడి చేసిన రౌడీకి మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తావా? పిన్నెల్లి సామ్రాజ్యంలో ప్రజాస్వామ్య స్థాపనకు వచ్చా. ఇక తప్పు చేయాలంటే భయపడాలి" అంటూ తీవ్రస్వరంతో వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Chandrababu
Pinnelli Ramakrishna Reddy
Macherla
Chandraiah

More Telugu News