ఇప్పుడు మా వాళ్ల పింఛన్లు తొలగిస్తున్నారు... రేపు మేం వస్తే మీ బంధువుల పింఛన్లు కట్!: చంద్రబాబు
- చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
- కుప్పం నియోజకవర్గంలో రోడ్ షో
- వైసీపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు
- వలంటీర్లు ఎక్కడికీ ఎగిరిపోరని వ్యాఖ్యలు
"ఈ ఊర్లో ఉండే వలంటీర్లూ మీరు ఇక్కడే ఉంటారు... ఎక్కడికీ ఎగిరిపోరు. బెదిరించొద్దు... మీ పని మీరు చేయండి, మా పని మేం చేస్తాం! వలంటీర్లను కూడా అడుగుతున్నా... ఈ వైసీపీ పాలనలో మీ బతుకులేమైనా బాగున్నాయా? మీకు రూ.5 వేలు ఇస్తూ, లక్ష రూపాయలు దోపిడీ చేస్తున్నారు" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.