సెకండ్ షెడ్యూల్ కి రెడీగా 'యశోద'
- 'యశోద'గా కనిపించనున్న సమంత
- థ్రిల్లర్ జోనర్లో నడిచే కథాకథనాలు
- ముఖ్యమైన పాత్రలో ఉన్ని ముకుందన్
- కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్
ఇక ఇప్పుడు ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగుకి రెడీ అవుతోంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను ఈ సినిమా టీమ్ వదిలింది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. ఇవి సినిమాలో హైలైట్ గా నిలిచే సన్నివేశాలని చెబుతున్నారు.
మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. మణిశర్మ అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాతో పాటు సమంత ప్రధానమైన పాత్రను పోషించిన 'శాకుంతలం' కూడా ఇదే ఏడాదిలో విడుదల కానుంది.