భర్త, కుమారుడిని కట్టేసి మహిళపై దుండగుల అత్యాచారం
- ఒడిశాలో దారుణ ఘటన
- ఇంట్లోకి దూరి సామూహిక అత్యాచారం
- ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు
వివరాల్లోకి వెళ్తే జయపురం స్థానిక సమితిలో ఒక వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. అదే సమితిలోని కుములిపుట్ పంచాయతీకి చెందిన మీణా హరిజన్, అతని స్నేహితులు అతని భార్యపై కన్నేశారు. అతని ఇంట్లోకి వెళ్లి భర్తను, కుమారుడిని కట్టేసి ఆమెపై అత్యాచారం చేసి పారిపోయారు.
జరిగిన దారుణంపై తన భార్యను తీసుకుని పోలీసులను భర్త ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మీణా హరిజన్ ను అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. త్వరలోనే మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. మరోవైపు జరిగిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కామాంధులకు కఠిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.