దేశ వ్యాప్తంగా శరవేగంగా కరోనా వ్యాప్తి.. ఒక్కరోజులో 90,928 కేసులు
- 325 మంది మృతి
- రోజువారీ పాజిటివిటీ రేటు 6.43 శాతం
- యాక్టివ్ కేసులు 2,85,401
- మృతుల సంఖ్య మొత్తం 4,82,876
ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 6.43 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో కరోనాకు 2,85,401 మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,43,41,009కు చేరింది. మృతుల సంఖ్య 4,82,876గా ఉంది. 148.67 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్లు వేశారు.