ఈనాడు, సాక్షి పత్రికల్లో ప్రకటనల ద్వారా ఆ ముగ్గురు టీటీడీ సభ్యులకు నోటీసులివ్వండి: ఏపీ హైకోర్టు
- బోర్డులో 18 మంది నేరచరితులు ఉన్నారంటూ పిల్
- వారికి పంపిన నోటీసుల్లో తిరిగొచ్చిన మూడు నోటీసులు
- పత్రికల్లో ప్రకటనల ద్వారా వారికి నోటీసులు ఇవ్వాలన్న కోర్టు
- ఫిబ్రవరి 7వ తేదీకి విచారణ వాయిదా
దీనికి స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం.. నోటీసులు అందుకోని ముగ్గురికి ఈనాడు, సాక్షి పత్రికల్లో ప్రకటనల ద్వారా నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, ఇప్పటికే నోటీసులు అందుకున్న వారు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.