ఏపీలో కొత్తగా 165 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 24,219 కరోనా పరీక్షలు
- విశాఖ జిల్లాలో 35 కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 1,260 మందికి చికిత్స
అదే సమయంలో 130 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,77,486 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,61,729 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,260 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,497కి పెరిగింది.