నేను ఆరోగ్యంగా ఉన్నా.. ఎవరూ ఆందోళన చెందవద్దు: వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి

My health good says YSRCP MLA Mekapati
  • మూడు రోజుల క్రితం గుండెపోటుకు గురైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
  • బెంగళూరు ఆసుపత్రి నుంచి నిన్న డిశ్చార్జ్
  • 10 రోజుల్లో అందరినీ కలుస్తానన్న మేకపాటి
వైసీపీ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మూడు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. బెంగళూరులోని ఆస్ట్రా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యానని చెప్పారు.

తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన అన్నారు. వైద్యుల సలహా మేరకు 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని తెలిపారు. మరో 10 రోజుల్లో అందరినీ కలుస్తానని చెప్పారు. సంక్రాంతికి వచ్చి శుభాకాంక్షలు చెపుతానని తెలిపారు. మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
Go Back to Shorts
Mekapati Chandra Sekhar Reddy
Heart Attack
Discharge

More Telugu News