అందుకే ‘చీప్ లిక్కర్’ పారిస్తామంటూ వ్యాఖ్య‌లు చేస్తున్నారు: విజ‌య‌సాయిరెడ్డి

vijay sai slams tdp
షార్ట్స్‌లో చూడండి
బీజేపీ అధికారంలోకి వస్తే రూ.50లకే నాణ్యతతో కూడిన క్వార్టర్ లిక్కర్ ఇస్తామంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు. చౌకబాబు ప్రకటనలు గుప్పిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

''జగన్ గారి సంక్షేమ పథకాలతో ప్రజలు వేరే పార్టీలను ఆదరించే పరిస్థితి లేదు. కొత్తగా ఏం చేయొచ్చో పాలుపోక ‘చీప్ లిక్కర్’ పారిస్తామంటూ చౌకబాబు ప్రకటనలు గుప్పిస్తున్నారు. లిక్కర్ బ్రాండ్ల గురించి వాపోతారు. మరో పక్క అప్పులు తెచ్చి వెల్ఫేర్ స్కీములు నడపడమేమిటని విమర్శించేది వీళ్లే'' అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Vijayasai Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News