తెలంగాణలో మరో 177 కరోనా కేసులు... తాజా బులెటిన్ వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 38,219 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 93 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,596 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,80,251 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,72,637 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,596 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,018కి పెరిగింది.
