ఏపీలో జరుగుతున్న మతమార్పిడులపై ఫిర్యాదులు అందాయి: కేంద్రం
- ఎఫ్‌సీఆర్ఏ కింద 18 ఎన్జీవోలు నమోదు
- ఇవన్నీ మతమార్పిడులకు పాల్పడుతున్న ఫిర్యాదులు
- ఎరవేయడం, ప్రేరేపించడం, వక్రీకరణ ద్వారా మతమార్పిడులు
- లోక్‌సభకు తెలిపిన కేంద్రమంత్రి
ఈ మేరకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ నిన్న లోక్‌సభకు తెలిపారు. ఎఫ్‌సీఆర్ఏ కింద నమోదైన 18 ఎన్జీవోలపైనా మూడేళ్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నట్టు చెప్పారు. ఫిర్యాదుల్లో పేర్కొన్న సంస్థల కార్యకాలాపాల పరిశీలన, ఖాతాల ఆడిటింగ్, తనిఖీ తదితర అంశాలను.. ఎఫ్‌సీఆర్ఏ నిబంధనల ఉల్లంఘనలపై ఏర్పాటు చేసిన లీగల్ యంత్రాంగం చూసుకుంటుందని సభకు తెలిపారు.