వారిపై పెట్టిన కేసేంటి?.. మీరు చేసింది ఏంటి?: అనంత ఎస్పీ ఫకీరప్పపై హైకోర్టు ఆగ్రహం
- ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ మహిళా నేతలపై కేసు
- ఇళ్లలో సోదాలు నిర్వహించిన పోలీసులు
- కేసుకు, సోదాలకు సంబంధమేంటని ప్రశ్నించిన హైకోర్టు
- అఫిడవిట్ పేరుతో సమర్పించిన దాంట్లో విషయం ఉందా? అని నిలదీత
- రెండు వారాల్లో మరో అఫిడవిట్ సమర్పిస్తానన్న ఎస్పీ ఫకీరప్ప
ఈ ఘటనపై దర్యాప్తు జరిపి అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశిస్తే.. దర్యాప్తు అధికారి నివేదిక జతచేసి అఫిడవిట్‌గా ఎలా సమర్పిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు అఫిడవిట్‌లో ఏమైనా విషయం ఉందా? దానిని మీరు చూశారా? అని ప్రశ్నల వర్షం కురిపించింది.
ఈ ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుందని ఎస్పీని ప్రశ్నించగా రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేస్తానని ఎస్పీ సమాధానమిచ్చారు. దీంతో కేసు విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు టీడీపీ మహిళా నేతలకు ఇది వరకే కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది.