ఇంటర్ బోర్డు ఫెయిల్ చేసిన విద్యార్థులందరికీ వచ్చే ఎన్నికల నాటికి ఓటు హక్కు వస్తుంది... కేసీఆర్ కు తగిన బుద్ధి చెబుతారు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాల రగడ
- ఫస్టియర్ లో 51 శాతం మంది ఫెయిల్
- ముగ్గురు విద్యార్థుల బలవన్మరణం
- కేసీఆర్ పై ధ్వజమెత్తిన కోమటిరెడ్డి
"కేసీఆర్ గుర్తుపెట్టుకో... ఇంటర్ బోర్డు ఫెయిల్ చేసిన విద్యార్థులందరికీ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటు హక్కు వస్తుంది. వారి జీవితాలతో చెలగాటమాడుతున్న మీకు, మీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో బాధిత విద్యార్థులు తగిన బుద్ధిచెప్పడం ఖాయం!" అని వ్యాఖ్యానించారు.