తెలంగాణలో మరో 134 మందికి కరోనా పాజిటివ్

Telangana corona update
  • గత 24 గంటల్లో 25,900 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 82 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,693 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,900 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 134 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీలోనే అత్యధికంగా 82 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 201 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,79,564 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,71,856 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,693 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించినవారి సంఖ్య 4,015కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Update
Today Cases

More Telugu News