AP Govt: మద్యం ధరలు తగ్గించిన ఏపీ ప్రభుత్వం... వచ్చేవారం నుంచి ప్రముఖ బ్రాండ్ల మద్యం విక్రయాలు

AP Govt revised liquor policy
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ప్రభుత్వం మద్యం విధానానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం పన్ను రేట్లలో మరోసారి మార్పులు చేసింది. వ్యాట్, ఎక్సైజ్ పన్ను, ప్రత్యేక మార్జిన్ ల అంశంలో హేతుబద్ధత తీసుకువచ్చింది. పన్నుల హేతుబద్ధత ద్వారా మద్యం ధరలు తగ్గుతాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ బ్రాండ్లపై 5 నుంచి 12 శాతం ధరలు తగ్గే అవకాశముంది. ఇతర అన్ని కేటగిరీలపై 20 శాతం వరకు ధరలు తగ్గుతాయని రజత్ భార్గవ పేర్కొన్నారు. అక్రమ మద్యం, నాటుసారా తయారీ అరికట్టేందుకే ధరల తగ్గింపు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. వచ్చేవారం నుంచి రాష్ట్రంలో ప్రముఖ సంస్థల బ్రాండ్ల మద్యం అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రంలో 37 శాతం మద్యం వినియోగం తగ్గిందని, అయితే అక్రమ రవాణా నిరోధించడానికే మద్యం ధరలు తగ్గిస్తున్నామని రజత్ భార్గవ వివరించారు.
Go Back to Shorts
AP Govt
Liquor Rates
Policy
Brands
Andhra Pradesh

More Telugu News