Sapathagiri: సప్తగిరి కూడా తగ్గడం లేదే!

Guduputani Movie Release Date Confirmed
కమెడియన్ గా సప్తగిరికి మంచి క్రేజ్ ఉంది. నెల్లూరు యాసతో ఆకట్టుకున్న ఆయన, కథానాయకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన హీరోగా చేసిన సినిమానే 'గూడుపుఠాణి'. శ్రీనివాస రెడ్డి - రమేశ్ నిర్మించిన ఈ సినిమా ద్వారా కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ ప్రధానంగా ఈ సినిమా నడుస్తుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సప్తగిరి మరింత స్టైల్ గా కనిపిస్తున్నాడు. ఆయన జోడీగా నేహా సోలంకి అలరించనుంది.

ఈ నెల 24వ తేదీన నాని 'శ్యామ్ సింగ రాయ్' సినిమా విడుదలవుతోంది. ఫ్యామిలీ హీరోగా నానికి మంచి క్రేజ్ ఉంది. ఇక కథానాయికలుగా సాయిపల్లవి - కృతి శెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అలాంటి సినిమా బరిలో ఉండగా, ఆ మరుసటి రోజు రంగంలోకి దిగుతుండటమనేది సప్తగిరి చేసే సాహసంగానే చెప్పాలి.
Sapathagiri
Neha Solanki
Guduputani Movie

More Telugu News