ఏపీలో గత 24 గంటల్లో 132 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 29,228 కరోనా పరీక్షలు
- శ్రీకాకుళం జిల్లాలో 36 కొత్త కేసులు
- కృష్ణా జిల్లాలో ఒకరి మృతి
- ఇంకా 1,823 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,108 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,58,817 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,823 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,468కి పెరిగింది.