Tejashwi Yadav: మతాంతర వివాహం చేసుకున్న తేజస్వి యాదవ్ పై మేనమామ సాధు యాదవ్ ఫైర్

Sadhu Yadav fires on Tejashwi Yadav
షార్ట్స్‌లో చూడండి
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన స్నేహితురాలు రేచల్ గొడిన్హోను పెళ్లాడారు. దక్షిణ ఢిల్లీలోని సైనిక్ ఫామ్ ప్రాంతంలో కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. మరోవైపు ఈ పెళ్లి చేసుకున్న తేజస్విపై ఆయన మేనమామ సాధు యాదవ్ మండిపడ్డారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ పరువు, ప్రతిష్ఠను ఆయన కుమారుడు తేజస్వి మంటకలిపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మతాంతర వివాహం చేసుకోవడం ద్వారా లాలూ ప్రతిష్ఠను తేజస్వి దెబ్బతీశాడని సాధు యాదవ్ మండిపడ్డారు. బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా పిలిపించుకునే అర్హత తేజస్వికి లేదని అన్నారు. పార్టీలో, కుటుంబంలో ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ నియంతృత్వాన్ని ఇకపై కొనసాగనివ్వబోమని... ఆయనకు తగిన గుణపాఠం చెపుతామని అన్నారు. మరో విషయం ఏమిటంటే ఈ పెళ్లికి సాధు యాదవ్ ని తేజస్వి ఆహ్వానించలేదు.
Go Back to Shorts
Tejashwi Yadav
Marriage
Sadhu Yadav
Lalu Prasad Yadav

More Telugu News